సెలవుల కోసం ఇంటికొచ్చి అదృశ్యమైన జవాను.. కారులో రక్తపు మరకలు
Add ap7am to your home Screen

సెలవుల కోసం ఇంటికొచ్చి అదృశ్యమైన జవాను.. కారులో రక్తపు మరకలు

Soldier goes missing in Kashmirs Kulgam
  • కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఘటన
  • సరుకులు తీసుకొచ్చేందుకు కారులో వెళ్లి అదృశ్యం
  • రంగంలోకి దిగిన ఆర్మీ
సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఓ జవాను తన వాహనం నుంచి కిడ్నాపయ్యాడు. కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిందీ ఘటన. కుల్గాం జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సైనికుడు జావెద్ అహ్మద్ వాని గత రాత్రి 8 గంటల సమయంలో అదృశ్యమయ్యాడు. ఆయన కారు ఆ తర్వాత పరన్‌హాల్ సమీపంలో లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 

సరుకులు తెచ్చేందుకు తన కారులో చౌవల్‌గామ్ వెళ్లిన జావెద్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన కోసం చుట్టుపక్కల గ్రామాల్లో గాలించారు. ఈ సందర్భంగా పర్నహాల్ గ్రామంలో ఆయన కారును గుర్తించారు. వాహనం లాక్ చేసి ఉండగా లోపల ఆయన చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి. జావెద్ కిడ్నాప్‌పై సమాచారం అందుకున్న ఆర్మీ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Soldier Missing
Jammu And Kashmir
Kulgam

More Telugu News