దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి చానళ్లలో టీమిండియా, వెస్టిండీస్ మ్యాచ్ లు.... తెలుగులో కామెంటరీ
- భారత్, వెస్టిండీస్ మధ్య ముగిసిన టెస్టు సిరీస్
- నేటి నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ లు
- బ్రిడ్జ్ టౌన్ లో నేడు తొలి వన్డే
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
కాగా, ఈ పర్యటనలో టెస్టు మ్యాచ్ లను భారత్ లో డీడీ స్పోర్ట్స్ ప్రసారం చేసింది. అయితే, పరిమిత ఓవర్ల సిరీస్ లోని వన్డేలు, టీ20 మ్యాచ్ లను దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు కూడా ప్రసారం చేయనున్నాయి.
డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి చానళ్లలోనూ టీమిండియా, వెస్టిండీస్ మ్యాచ్ ల లైవ్ కవరేజీ అందించనున్నారు. కామెంటరీ కూడా తెలుగులోనే అందించనుండడం విశేషం. దూరదర్శన్ లో తెలుగు కామెంటరీతో క్రికెట్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి.