జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీజేపీ
- పార్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ చర్యలు తీసుకున్న రాష్ట్ర నాయకత్వం
- భువనగిరి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడు
- కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా ప్రచారం
ఉమ్మడి నల్గొండలో, భువనగిరి నియోజకవర్గంలో జిట్టా బలమైన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పని చేశారు. 2009లో టీడీపీ, బీఆర్ఎస్ పొత్తు కారణంగా టిక్కెట్ దక్కలేదు. ఆ సమయంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా స్వతంత్రంగానే పోటీ చేశారు. ఆ తర్వాత తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కమలదళంలో తనకు గుర్తింపు లేదనే ఆవేదన ఆయనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.