హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములతో భారీ వర్షం
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక
- అప్రమత్తమైన అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది
- హైదరాబాద్-విజయవాడ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్
కొండాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, తార్నాక, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, బోయినపల్లి, బేగంపేట, రామ్ నగర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హైదరాబాద్ - విజయవాడ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. అబ్దుల్లాపూర్ మెట్ నుండి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో ద్విచక్రవాహనదారులు వంతెనల కింద తలదాచుకున్నారు.