AP: ఈ నెల 25, 26 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP gets Very heavy rain fall alert from IMD
షార్ట్స్‌లో చూడండి
దేశంలో రుతుపవన ద్రోణి స్థిరంగా, క్రియాశీలకంగా కొనసొగుతోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇప్పటికే ఓ ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ పై కొనసాగుతోందని, రేపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని ఐఎండీ వివరించింది. 

ఈ నేపథ్యంలో, ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 25 నుంచి 27 వరకు రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ నెల 25, 26 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి 27 వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.
Go Back to Shorts
AP
Heavy Rains
IMD
Telangana
Monsoon
India

More Telugu News