Mahesh Babu: ఫ్యామిలీతో కలిసి మరో విహార యాత్రకు మహేశ్ బాబు

Mahesh Babu goes for another vacation with family
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు షూటింగ్ విరామం వస్తే ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ వెళ్లడం కామన్. ప్రస్తుతం మహేశ్ బాబు... త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల వరకు బిజీ షెడ్యూల్ లో పాల్గొన్న మహేశ్ బాబు ప్రస్తుతం బ్రేక్ దొరికేసరికి విహారయాత్రకు ప్లాన్ చేశాడు. మహేశ్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చాడు. అలాగే, విమానంలో కుమార్తెతో కలిసి ఉన్నప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మహేశ్ బాబు తాజా విహారయాత్ర 3 వారాల పాటు కొనసాగనుందని తెలుస్తోంది.
Go Back to Shorts
Mahesh Babu
Family
Vacation
Guntur Kaaram
Trivikram Srinivas
Superstar

More Telugu News