PM Modi: ఫ్రాన్స్‌ లో నా టూర్‌ సాగిందిలా.. ప్రధాని మోదీ వీడియో ట్వీట్.. వీడియో ఇదిగో !

PM Modi shares video of Bastille Day parade in Paris
షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడి ఆహ్వానంతో ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ టూర్ కు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల దృశ్యాలతో మొదలైన వీడియో.. ఈఫిల్ టవర్ వద్ద ముగుస్తుంది. 

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బాస్టిల్ డే పరేడ్‌ దృశ్యాలతో పాటు మోదీ పాల్గొన్న కార్యక్రమాల గ్లింప్స్ కూడా వీడియోలో చూడొచ్చు. శుక్రవారం పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో మోదీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు, మ్యూజియంలోకి ప్రధాని మోదీని స్వాగతిస్తున్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ లను కూడా చూడొచ్చు.

ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలో ఏర్పాటు చేసిన విందు స్వీకరించిన తర్వాత మ్యూజియంలోని ఐకానిక్ వర్క్‌లను మోదీ ప్రత్యేకంగా వీక్షించడం కనిపిస్తోంది. ఈ మ్యూజియంలో చివరిసారిగా 1953లో క్వీన్ ఎలిజబెత్ కోసం విందు జరిగింది. మళ్లీ ఇప్పుడు ప్రధాని మోదీ కోసం ఈ మ్యూజియంలో విందు ఏర్పాటు చేశారు.
Go Back to Shorts
PM Modi
vedio
tweet
paris tour
Bastille Day parade

More Telugu News