తిరుమల కొండపై పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన వెల్లంపల్లి శ్రీనివాస్

Vellampalli Srinivas comments on Pawan Kalyan
  • ప్యాకేజీ రావడం వల్లే వారాహి యాత్ర తొలి విడత పూర్తి చేశారన్న వెల్లంపల్లి
  • మరో ప్యాకేజీ ఇస్తే రెండో విడత ప్రారంభిస్తారని విమర్శ
  • ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడటం అనవసరమని వ్యాఖ్య
ఏపీ దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. ప్యాకేజీ రావడం వల్లే తొలి విడత వారాహి యాత్రను పూర్తి చేసుకున్నారని అన్నారు. 

మరో ప్యాకేజీ ఇస్తే.. రెండో విడత యాత్రను ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడటం అనవసరమని చెప్పారు. ఎవరెన్ని యాత్రలు చేసినా జగన్ మరోసారి సీఎం కావడాన్ని ఆపలేరని అన్నారు. వైసీపీ రెండో సారి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Vellampalli Srinivasa Rao
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News