భారతీయ కాన్సులేట్‌పై దాడిని ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు
- శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ కాన్సులేట్‌పై జులై 2న ఖలిస్థానీ మద్దతుదారుల దాడి
- కార్యాలయానికి నిప్పుపెట్టిన వైనం, వెంటనే మంటలను ఆర్పేసిన సిబ్బంది
- దాడిని ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు
- నిందితులపై చర్యలకు డిమాండ్
ఈ నెల 2న కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హింసను ప్రోత్సహిస్తే హింసే ఎదురవుతుందంటూ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వార్తలు కూడా జత చేశారు. దీంతో, ఈ ఘటన పెను దుమారానికి దారి తీసింది.