Advertisement

జగన్ తో తెలంగాణ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ

Ponguleti Srinivas Reddy meets Jagan
  • తాడేపల్లిలో జగన్ తో పొంగులేటి భేటీ
  • కాంగ్రెస్ లోకి షర్మిల చేరికపై చర్చించినట్టు సమాచారం
  • ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఏపీ సీఎంతో పొంగులేటి భేటీ ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. మరోవైపు ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
Advertisement
Ponguleti Srinivas Reddy
Congress
Jagan
YSRCP

More Telugu News