ఏబీ వెంకటేశ్వరావుకు భారీ ఊరట.. సీఎస్ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు
- ఏబీ వెంకటేశ్వరరావు విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించిన చీఫ్ సెక్రటరీ
- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వెంకటేశ్వరరావు
- విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం
తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని సీఎస్ కు ఏబీ వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన విదేశీ పర్యటనకు అనుమతిని ఇచ్చేందుకు సీఎస్ నిరాకరించారు. దీంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఏబీవీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.