మహేశ్ బాబు పోస్టు చేసిన ఫేవరెట్ ఎక్సర్ సైజుల వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు పోస్టు చేసిన ఫేవరెట్ ఎక్సర్ సైజుల వీడియో ఇదిగో!

Mahesh Babu shares hie favorite exercises video
  • ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సూపర్ స్టార్
  • శనివారం సిజిల్ అంటూ వీడియో పంచుకున్న మహేశ్ బాబు
  • మీరెంత సేపు వ్యాయామం చేయగలరంటూ నెటిజన్లను ప్రశ్నించిన వైనం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ ఫిట్ నెస్ పై ఎంత శ్రద్ధ చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం వ్యాయామం చేస్తుండడం వల్లే మహేశ్ అంత నాజూగ్గా ఉంటాడు. తన జిమ్ వర్కౌట్ల వీడియోలను మహేశ్ బాబు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. తాజాగా తన ఫేవరెట్ ఎక్సర్ సైజులు అంటూ ఓ వీడియోను పంచుకున్నాడు. 

"ఇదే నా శనివారం వ్యవహారం. నా ఫేవరెట్ ఎక్సర్ సైజ్ స్కిల్ మిల్ తో వ్యాయామం చేశాను. ఒక నిమిషం పాటు  ల్యాండ్ మైన్ ప్రెస్సింగ్, ఒక నిమిషం పాటు కెటిల్ బెల్ స్వింగ్స్, ఒక నిమిషం పాటు స్కిల్ మిల్ రన్..." అంటూ తన వ్యాయామం ఏ క్రమపద్ధతిలో సాగిందీ మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో వివరించాడు. ఇదే ఆర్డర్ లో మీరెంత సేపు వ్యాయామం చేయగలరు? అంటూ నెటిజన్లను కూడా ప్రశ్నించారు. 

మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పూర్తయితే రాజమౌళితో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
Advertisement
Mahesh Babu
Exerecises
Gym
Video
Superstar
Guntur Kaaram
Tollywood

More Telugu News