జూన్ మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు వెల్లడించిన కేంద్రం
- జూన్ నెలలో రూ.1.61 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
- గతేడాది జూన్ తో పోల్చితే 12 శాతం వృద్ధి
- 18 శాతం మేర పెరిగిన దేశీయ ఆర్థిక లావాదేవీలు
సరుకు దిగుమతులపై సుంకం రూ.39,035 కోట్లతో కలిపి సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.80,292 కోట్లు, సెస్ రూ.11,900 కోట్లు (సరుకు దిగుమతులపై వసూలైన రూ.1,028 కోట్లతో కలిపి) అని పేర్కొంది.
గతేడాది జూన్ తో పోల్చితే ఈ జూన్ లో వసూలైన జీఎస్టీ 12 శాతం అధికం. అదే సమయంలో గతేడాది జూన్ తో పోల్చితే ఈ జూన్ లో దేశీయ ఆర్థిక లావాదేవీల్లో 18 శాతం వృద్ధి నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది.
ఇక, జీఎస్టీ వసూళ్లు ఓ నెలలో రూ.1.60 లక్షల కోట్ల మార్కు దాటడం ఇది నాలుగోసారి.