లండన్ వీధుల్లో విహరించిన ఇద్దరు క్రికెట్ లెజెండ్స్

లండన్ వీధుల్లో విహరించిన ఇద్దరు క్రికెట్ లెజెండ్స్

When Sachin Tendulkar met Brian Lara in London
  • అనుకోకుండా ఒక్కటైన సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా
  • లండన్ లో రోజంతా విహారం
  • ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్న సచిన్
వారిద్దరు రెండు దేశాల తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు. ఎన్నో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన వారు. వారే వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా, భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. కానీ అనుకోకుండా లండన్ లో కలుసుకున్నారు. ఇంకేముంది.. ఓ రోజంతా లండన్ అందాలను వీక్షిస్తూ సమయం వెచ్చించారు. 

ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు. రెండు ఫొటోలను షేర్ చేశారు. లండన్ వీధిలో నడుస్తున్నట్టు ఆ ఫొటోల్లో ఉంది. ‘‘ఈ రోజు ఆసక్తి కలిగిన మరో గోల్ఫ్ క్రీడాకారుడిని కలుసుకున్నాను’’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు. సచిన్, లారా ఇద్దరూ గోల్ఫ్ కూడా ఆడుతుంటారు. సచిన్ కు అభిమానులు ఎక్కువనే విషయం తెలిసిందే. సచిన్ పెట్టిన ట్వీట్ ను ఇప్పటికే 16 లక్షల మంది చూశారు. 

ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు కలుసుకోవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కాలాల్లోకీ గొప్ప బ్యాటర్లు వీరిద్దరూ అంటూ ఓ అభిమాని అభిప్రాయం వెలిబుచ్చారు. క్రికెట్ చరిత్రలో గొప్ప కుడి, ఎడమ చేతివాటం బ్యాటర్లు అని శుభ్ మన్ గార్గ్ అనే యూజర్ కామెంట్ చేశాడు.
Advertisement
Sachin Tendulkar
Brian Lara
meet
london

More Telugu News