హెచ్1బీ వీసా హోల్డర్లకు కెనడాలోకి ఎంట్రీ ఫ్రీ.. వర్క్ పర్మిట్ కూడా ఉచితమే
- వీసా హోల్డర్ల కుటుంబ సభ్యులూ పనిచేసుకోవచ్చంటున్న ట్రూడో సర్కారు
- పది వేల మందికి అవకాశం కల్పించనున్నట్లు కెనడా మంత్రి ప్రకటన
- మూడేళ్ల తాత్కాలిక నివాసానికి అనుమతించనున్నట్లు వెల్లడి
ఇలా దేశంలోకి అడుగుపెట్టే హెచ్1బీ వీసా హోల్డర్లకు మూడేళ్ల పాటు తాత్కాలిక నివాస హోదా కల్పిస్తామని మంత్రి వివరించారు. అయితే, ఈ అవకాశం కేవలం 10 వేల మందికి మాత్రమేనని, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వచ్చే విదేశీ నిపుణులకు ఇచ్చే వీసానే ఈ హెచ్1బీ.. ఈ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను డింపెండెంట్ వీసాపై అమెరికా తీసుకుని వెళ్లవచ్చు.
ఇలా అమెరికాలో అడుగుపెట్టే వారు ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలన్నా ప్రత్యేకంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారిలో భారతీయులు, చైనా వారే ఎక్కువగా ఉన్నారు. వృత్తిపరంగా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారికే అమెరికా ఈ హెచ్1బీ వీసా జారీ చేస్తుంది. ఈ క్రమంలో నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు కెనడా ప్రభుత్వం తాజా వెసులుబాటు కల్పించింది.