యూపీఐ ఛార్జీల అమలుపై కీలక నిర్ణయం.. వ్యాపారులకు పండగ ఊరట!
- పండగ సీజన్ దృష్ట్యా యూపీఐ ఛార్జీల అమలు వాయిదా
- వ్యాపారుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్న ఎన్‌పీసీఐ
- దీపావళి తర్వాత అమలు చేయనున్నట్టు ప్రకటన
- రూ.2,000 దాటిన లావాదేవీలపై వ్యాపారులకు ఛార్జీలు
- ఛార్జీల భారం వినియోగదారులపై ఉండదని స్పష్టీకరణ
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిపే మర్చంట్ లావాదేవీలపై ప్రతిపాదిత ఎండీఆర్ ఛార్జీల అమలును వాయిదా వేస్తున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. పండగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో వ్యాపార వర్గాలకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.
ఈ విషయంపై మంగళవారం సమావేశమైన యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ, ఈ నిర్ణయాన్ని ఖరారు చేసింది. "పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎంపిక చేసిన పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను దీపావళి తర్వాత అమలు చేయాలని నిర్ణయించాం. కచ్చితమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తాం" అని ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం, ఛార్జీల అమలు నవంబర్ రెండో వారం తర్వాత ఉండే అవకాశం ఉంది.
ఏమిటీ ఛార్జీలు?.. ఎవరిపై భారం?
గత సెప్టెంబర్‌లో యూపీఐ స్టీరింగ్ కమిటీ, రూ.2,000కు మించిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించాలని నిర్ణయించింది. అంటే, వ్యాపారి ప్రతి రూ.2,000 లావాదేవీపై రూ.8, అలాగే రూ.10,000 లావాదేవీపై రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఛార్జీల భారం వినియోగదారులపై పడదని, కేవలం వ్యాపారులు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంత పెద్ద లావాదేవీ అయినా గరిష్ఠంగా రూ.300 మించి ఛార్జీ విధించరు. ఉదాహరణకు, రూ.75,000 అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 మాత్రమే వసూలు చేస్తారు.
రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ముడిసరుకులు వంటి కొన్ని కీలక రంగాల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీని ప్రతిపాదించారు. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు (పీ2పీ), అలాగే రోజువారీ చిన్న వ్యాపార లావాదేవీలు యథాతథంగా ఉచితంగానే కొనసాగుతాయి. యూపీఐ వ్యవస్థ నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, కస్టమర్ సపోర్ట్ వంటి మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చేందుకే ఈ ఛార్జీలను ప్రతిపాదించినట్టు కేంద్రం వివరించింది.