Roja: హాయ్ ఏపీ.. బైబై బీపీ: రోజా

Roja satires on Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
'హాయ్ ఏపీ.. బైబై వైసీపీ' అనేది మన నినాదమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. 'హాయ్ ఏపీ.. బైబై బీపీ (బాబు, పవన్)' అనే నినాదాన్ని ప్రజలు అందుకుంటారని అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీకి జిల్లాల అధ్యక్షులు లేరని, 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని చెప్పారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ ను రాష్ట్రం నుంచి తరిమేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

పవన్ ఒక రోజు సీఎం అవుతానని అంటారని, మరొకరోజు ఎమ్మెల్యే అవుతానని చెపుతారని రోజా ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చేస్తారో అనే క్లారిటీ పవన్ కు ఉండాలని అన్నారు. వైసీపీ నేతలను కొడతా అని చెప్పడానికే పార్టీ పెట్టారా? అని ప్రశ్నించారు. అన్నీ చేస్తున్న జగన్ ను కాదని పవన్ కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. స్లోగన్ దగ్గర నుంచి మేనిఫెస్టో వరకు అన్నింటినీ చంద్రబాబు కాపీ కొడుతున్నారని... బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే శక్తి కూడా వీరికి లేదని రోజా అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా తమకు భయం లేదని చెప్పారు.

Go Back to Shorts
Roja
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News