భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఫిచ్ రేటింగ్స్
- జీడీపీ వృద్ధి రేటు సవరించిన ఫిచ్
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం నుండి 6.3 శాతానికి పెంపు
- మొదటి త్రైమాసికంలో మెరుగైన వృద్ధి, స్వల్పకాలంలో వృద్ధికి అవకాశాల నేపథ్యంలో సవరణ
- ఆటో సేల్స్, పీఏఐ సర్వేలు, రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడి
ఈ ఏడాది జనవరి - మార్చి త్రైమాసికంలో అంచనాలకు మించి భారత జీడీపీ 6.1 శాతం నమోదు చేసినట్లు ఫిచ్ తెలిపింది. ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు, పీఏఐ సర్వేలు, రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదవుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను పెంచుతున్నట్లు ఫిచ్ తెలిపింది.