హైదరాబాద్ లో దారుణం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ప్రియురాలిపై జొమాటోలో పనిచేసే ప్రియుడు కత్తితో దాడి!

Zomato boy attacked her software lover with knife in Hyderabad
  • కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వాసవి, గణేశ్
  • నిన్న రాత్రి నార్సింగిలోని హోటల్ వద్దకు రావాలని పిలిచిన గణేశ్
  • దాడిలో వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలు
హైదరాబాద్ గండిపేట మండలం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ప్రియురాలిపై జొమాటోలో పని చేస్తున్న ప్రియుడు కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే... వాసవి, గణేశ్ ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వాసవిది పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కాగా... గణేశ్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉంటున్నాడు. వీరిద్దరూ ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. ప్రేమలో ఉన్న వీరిద్దరూ ప్రతిరోజు సాయంత్రం కలుసుకునేవారు. 

నిన్న రాత్రి వాసవిని నార్సింగిలోని టీ గ్రిల్ హోటల్ వద్దకు రావాలని గణేశ్ పిలిచాడు. దీంతో ఆమె హోటల్ వద్దకు వచ్చింది. కాసేపటి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తన బ్యాగ్ లో నుంచి కత్తిని తీసి వాసవిపై గణేశ్ దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఆమె మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి, గణేశ్ కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Lover
Attack

More Telugu News