మంత్రి రాజా మామ బెదిరించి భూమిని అగ్రిమెంట్ చేయించుకున్నారంటూ మహిళ ఆరోపణలు!
- మంత్రి దాడిశెట్టి మామపై భూకబ్జా ఆరోపణలు
- బెదిరించి, అగ్రిమెంట్ చేయించుకున్నారని మహిళ ఆరోపణ
- తనపై బురదజల్లేందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మామ వివరణ
మహిళ ఆరోపణలపై సూర్యచక్రం కూడా స్పందించారు. తనపై బురదజల్లేందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని అమ్మేందుకు కామేశ్వరి ఒప్పందం చేసుకున్నారని, రూ.90 లక్షల మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకున్నారని గుర్తు చేశారు. డబ్బులు తీసుకొని, తిరిగి తననే బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. న్యాయపరంగా అనుమతులు తెచ్చుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ ఆలస్యమవుతోందన్నారు. తాము మానవతా దృక్పథంతో చూసినా ఆరోపణలు చేస్తున్నారన్నారు.