ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎక్కడ, ఎప్పుడంటే..!
- ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రంపై భారీ అంచనాలు
- 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న చిత్రం
- ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్
ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించగా..సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కనిపించనుంది. విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఆదిపురుష్ అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఆదిపురుష్ ను ఓటీటీలో చూడాలంటే రెండు నెలలు వేచి ఉండాల్సిందే.