టీమిండియా వెస్టిండీస్ పర్యటన... షెడ్యూల్ విడుదల
- జులై - ఆగస్ట్ లో టీమిండియా... వెస్టిండీస్ పర్యటన
- రెండు జట్ల మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు
- సోమవారం రాత్రి షెడ్యూల్ విడుదల
జులై 12 నుండి 16 మధ్య డొమినికాలోని విండ్సర్ పార్కులో తొలి టెస్ట్, జులై 20-24 మధ్య ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ లో రెండో టెస్ట్ జరగనుంది. జులై 27 - ఆగస్ట్ 1 మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహిస్తారు. ఆగస్ట్ 3, 6, 8, 12, 13 తేదీలలో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.