ఐ-టీడీపీ పనితీరు చాలా వేగంగా ఉంది: చంద్రబాబు
- మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఐ-టీడీపీ సదస్సు
- ఐ-టీడీపీ కార్యకర్తల వల్లే 21 లక్షల మంది సభ్యత్వం నమోదైందని వెల్లడి
- మేనిఫెస్టోను ఐ-టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచన
సమస్యలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని చైతన్యం తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
ఐ-టీడీపీ పనితీరు చాలా వేగంగా ఉందని కొనియాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా పర్ఫెక్ట్ గా చేశారని, ఐ-టీడీపీ కార్యకర్తల కృషి వల్లే 21 లక్షల మంది సభ్యత్వం నమోదైందని అభినందించారు. టెక్నాలజీ వినియోగంలోనూ ఐ-టీడీపీ ముందంజ వేస్తోందని కితాబిచ్చారు.
ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు చేరవేసే విధానం మారుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. సమాచారం ఎంత వేగంగా చేరవేస్తారో వారే విజయం సాధిస్తారని తెలిపారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ కార్యకర్తలకు మెసేజ్ వెంటనే చేరిపోతోందని వెల్లడించారు. ఏ కంటెంట్ ఎవరికి పంపాలో వారికి పంపిస్తూ ఐ-టీడీపీ సమర్థంగా పనిచేస్తోందని ప్రశంసించారు.