ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే..!

Hyderabad is worlds 202th costliest city
  • దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
  • అంతర్జాతీయంగా హైదరాబాద్ కు 202వ స్థానం
  • ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం హాంగ్ కాంగ్
భారత్ లో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై అగ్ర స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో 147వ స్థానంలో ఉంది. ఈ వివరాలను మెర్సర్స్ 2023 జీవన వ్యయ సర్వే నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్ కతా 211, పూణె 213 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 227 పట్టణాలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా హాంగ్ కాంగ్, సింగపూర్, జ్యూరిచ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నివాసం, ఆహారం, రవాణా, ఇంటి వస్తువులు, వినోదానికి అయ్యే ఖర్చు, వస్త్రాలు.. ఇలా 200 వ్యయాల ఆధారంగా నివేదికను రూపొందించారు. మల్టీ నేషనల్ కంపెనీలు విదేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలంటే ముంబై, ఢిల్లీ వ్యయాల పరంగా అనుకూలమని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో తక్కువ ఖరీదైన నగరాల్లో పాకిస్థాన్ కు చెందిన కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి.
Go Back to Shorts
Hyderabad
Costliest city
World
India

More Telugu News