రూ.4 కోట్ల లగ్జరీ లంబోర్ఘిని కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్
- ఇప్పటికే సచిన్ గ్యారేజీలో ఎనిమిది వరకు లగ్జరీ కార్లు
- తాజాగా లేటెస్ట్ టాప్ వేరియంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ కొనుగోలు
- లంబోర్ఘిని కారులో సచిన్ ప్రయాణిస్తున్న వీడియో
సచిన్ గ్యారేజీలోకి చేరిన తాజా కారు వ్యాల్యూ రూ.4.18 కోట్లు. ఈ కారు ఉరుస్ లైనప్ లో వచ్చిన రెండో మోడల్. టెండూల్కర్ ఈ లంబోర్ఘిని కారులో ప్రయాణిస్తున్న వీడియోను సీఎస్ 12 వోల్గ్స్ అనే యూట్యూబ్ సంస్థ షేర్ చేసింది. 2012 నుండి కార్ల సంస్థ బీఎండబ్ల్యుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు సచిన్. దీంతో అతని గ్యారేజీలో బీఎండబ్ల్యు కార్లు ఎక్కువగా ఉంటాయి.