Vijay Antony: వైజాగ్ లో 'బిచ్చగాడు 2' సక్సెస్ మీట్ .. ఎప్పుడంటే..!

  • ఈ నెల 19న విడుదలైన 'బిచ్చగాడు 2'
  • తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో 9.5 కోట్ల గ్రాస్ వసూలు
  • ప్రపంచవ్యాప్తంగా లాభాల బాట పట్టిన సినిమా 
  • 2025లో 'బిచ్చగాడు 3' ఉంటుందని వెల్లడి 
Bichagadu 2 movie update

విజయ్ ఆంటోని నుంచి గతంలో వచ్చిన 'బిచ్చగాడు' ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తరువాత ఆయన ఎన్ని సినిమాలు చేసినా ఆ స్థాయి సక్సెస్ మాత్రం రాలేదు. అలాంటి విజయం ఆయనకి మళ్లీ 'బిచ్చగాడు 2'తోనే సాధ్యమైంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా ఈ నెల 19వ తేదీన విడుదలైంది. అక్కడ మాదిరిగానే ఇక్కడ కూడా మొదటి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. 


3 రోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా లాభాల బాటలో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్  మీట్ ను వైజాగ్ -  బీచ్ రోడ్ లోని 'గోకుల్ పార్క్'లో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 

'బిచ్చగాడు' సాధించిన రికార్డులను చూస్తే, సెకండు పార్టుతో అంచనాలను అందుకోవడం సాహసంతో కూడుకున్న పనే అనిపించుకుంటుంది. అలాంటి సాహసాన్ని ఒక దర్శకుడిగా .. నిర్మాతగా .. సంగీత దర్శకుడిగా .. ఎడిటర్ గా విజయ్ ఆంటోని చేశాడు. 'బిచ్చగాడు 3' కూడా ఉంటుందనీ .. అయితే అది కూడా సెపరేటు కంటెంట్ తో ఉంటుందనీ .. 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ఆయన అన్నారు.

More Telugu News