సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
- కూకట్ పల్లి నివాసంలో గుండెపోటుకు గురైన రాజ్
- రేపు అంత్యక్రియలు
- రాజ్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు
రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడే రాజ్. కోటితో జతకట్టి రాజ్-కోటి పేరుతో ఈ జంట సుదీర్ఘకాలం పాటు శ్రోతలను తమ సంగీతంతో ఉర్రూతలూగించారు. బీట్ ఓరియెంటెడ్ పాటలకు ఈ జోడీ పెట్టింది పేరు. వీరిద్దరూ 180 చిత్రాలకు పైగా సంగీతం అందించారు. ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్ కూడా చేశారు.
నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రం హలో బ్రదర్ కు ఈ జోడీ బంగారు నంది అందుకుంది. కోటి నుంచి విడిపోయాక రాజ్ 10 సినిమాలకు పైగా సొంతంగా సంగీతం అందించారు. కొన్ని సినిమాల్లో రాజ్ నటుడిగానూ కనిపించారు.