బజరంగ్ దళ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- హిందుత్వ పేరుతో దాడులకు పాల్పడడాన్ని అంగీకరించబోమన్న దిగ్విజయ్
- బజరంగ్ దళ్‌ను గూండాల సమూహంగా అభివర్ణించిన కాంగ్రెస్ నేత
- హిందూత్వ అంటే ఏకీభవించని వారిపై దాడులు చేయడమే దాని పనని వ్యాఖ్యలు
మనది సనాతన ధర్మమని, హిందూత్వను తాము ధర్మంగా పరిగణించబోమని స్పష్టం చేశారు. హిందూత్వ అంటే తమతో ఏకీభవించని వారిపై కర్రలతో దాడిచేయడం, ఇళ్లు కూల్చేయడం, డబ్బు దోచుకోవడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ బజరంగ్ దళ్‌ను బజరంగ్ బలి (హనుమంతుడు)తో పోల్చడం బాధాకరమని దిగ్విజయ్ అన్నారు.