లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. చెన్నైలోని 8 ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలు

ED raids Chennai office of Lyca productions
  • పుష్ప, ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ‘లైకా’
  • లైకా ప్రొడక్షన్స్‌పై ‘ఫెమా’ ఉల్లంఘన ఆరోపణలు
  • తనిఖీలపై పెదవి విప్పని నిర్మాణ సంస్థ
పుష్ప, ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాలను నిర్మించి లైకా ప్రొడక్షన్స్‌‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. చెన్నైలోని టి.నగర్, అడయార్, కరపక్కమ్ సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ ఉదయం ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. 

లైకా మొబైల్స్ వంటి పలు బ్రాండ్లు కలిగి ఉన్న లైకాపై మనీలాండరింగ్ (ఫెమా) వంటి ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే తాజా తనిఖీలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే, లైకా నుంచి మాత్రం ఈడీ తనిఖీలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. 

కాగా, ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పొన్నియన్ సెల్వన్ 1, 2 సినిమాలతోపాటు కత్తి, రోబో 2.0, దర్బార్ వంటి చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇండియన్ 2, లాల్ సలామ్ వంటి సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.
Go Back to Shorts
Lyca Productions
ED Raids
RRR
Pushpa
Tamil Nadu

More Telugu News