స్ట్రీమింగ్ కి రెడీగా నిహారిక 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్!

Dead Pixels Webseries release date confirmed
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'డెడ్ పిక్సెల్స్'
  • వీడియో గేమ్స్ నేపథ్యంలో నడిచే కథ  
  • ఈ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇస్తున్న నిహారిక
  • ఈ నెల 19 నుంచి అందుబాటులోకి
నిహారిక కొణిదెల గతంలో తన సొంత బ్యానర్లో కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించింది. ఆ వెబ్ సిరీస్ లలో ఆమెనే ప్రధానమైన పాత్రను పోషించింది. పెళ్లి తరువాత గ్యాప్ తీసుకున్న నిహారిక మళ్లీ 'డెడ్ పిక్సెల్స్' అనే వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. బ్రిటన్ వెబ్ సిరీస్ ఆధారంగా దీనిని రూపొందించారు.  

ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. గాయత్రిగా నిహారిక ప్రధానమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో,  అక్షయ్ .. భావన .. వైవా హర్ష కనిపించనున్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ .. ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తించింది. 

వీడియో గేమ్స్ చూపిస్తున్న ప్రభావం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. కొంతమంది యువతీ యువకులు వీడియో గేమ్ ఆడుతూ తమ చుట్టూ ఏం జరుగుతుందనేది పట్టించుకోకపోవడం వలన, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది? అనేది కథ.
Advertisement
Niharika
Akshay
Viva Harsha
Bhavana

More Telugu News