తలచుకుంటే వింతగా ఉంది.. నేను మిస్ వరల్డ్ టైటిల్ గెలిచినప్పుడు నిక్ వయసు ఏడేళ్లేనట: ప్రియాంకా చోప్రా

did you know nick jonas watched priyanka chopra win miss world in 2000
షార్ట్స్‌లో చూడండి
గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ జోనస్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ ను ప్రియాంక గెలుచుకున్నారు. అప్పుడామె వయసు 17 ఏళ్లే. ఇక నిక్ వయసు నాడు ఏడేళ్లే. దీనిపై తాజాగా ప్రియాంక స్పందించారు. జెన్నిఫర్ హడ్సన్ టాక్ షోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాను మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుపొందినప్పుడు నిక్‌ జోనస్‌కు ఏడేళ్లని, ఇలా చెప్పడం కాస్త వింతలా ఉందని ఆమె అన్నారు. ‘‘నేను పదిహేడేళ్ల వయసులో మిస్‌ వరల్డ్‌ కిరీటం అందుకున్నా. లండన్‌ వేదికగా జరిగిన ఆ పోటీల్లో పాల్గొన్నాను. అప్పుడు నేను చిన్న పిల్లనే’’ అని ప్రియాంక వివరించారు.

‘‘2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలను మా మావయ్య, అత్తయ్య టీవీలో చూశారట. నేను టైటిల్‌ గెలుపొందిన క్షణాలు తనకింకా గుర్తేనని అత్తయ్య నాతో చెప్పారు. అప్పుడు నిక్‌ వయసు ఏడేళ్లట. ఇంట్లో వాళ్లతోపాటు తను కూడా టీవీ ముందు కూర్చొని నన్ను చూశాడట. తలచుకుంటే వింతగా ఉంది’’ అని గుర్తు చేసుకున్నారు. 

‘‘కాలం మా ఇద్దర్నీ కలిపింది. మేము కలవాలని రాసిపెట్టి ఉంది. వయసుపరంగా మా ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ మేం ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం’’ అని ప్రియాంకా చోప్రా తెలిపారు. 

నిక్‌తో బంధం ఏర్పడటానికి ముందు తాను చాలామందితో డేట్‌ చేశానని, నిక్‌కు కూడా రిలేషన్‌షిప్స్‌ ఉన్నాయని చెప్పారు. వాటి గురించి పట్టించుకోలేదని, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించనని చెప్పారు. భవిష్యత్తు కోసం అడుగులు వేయడమే తమ ఇద్దరికీ ఇష్టమని చెప్పారు.
Go Back to Shorts
Priyanka Chopra
Nick Jonas
miss world

More Telugu News