వేగంగా క్షీణిస్తున్న కరోనా.. వీక్లీ కేసుల్లో 57 శాతం తగ్గుదల

వేగంగా క్షీణిస్తున్న కరోనా.. వీక్లీ కేసుల్లో 57 శాతం తగ్గుదల

Covid waning fast weekly cases down 57 percent
  • వరుసగా రెండో వారంలో కొత్త కేసుల తగ్గుదల
  • గతవారం 50,769లతో పోలిస్తే ఈవారం 21,798కి తగ్గిన కేసులు
  • మరణాలు కూడా 131 నుండి 95కి తగ్గాయి
కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండవ వారంలో కొత్త కేసులు బాగా తగ్గాయి. గత వారం కంటే సగానికి పైగా కేసులు తగ్గాయి. ఆదివారం (మే 1-7)తో ముగిసిన వారంలో భారతదేశంలో 21,798 కేసులు నమోదయ్యాయి. గతవారం 50,769 కేసులతో పోలిస్తే ఇది 57% తగ్గుదల. అంతకుముందు వారంలో మరణాలు 131 ఉండగా ఈ వారం 95కి తగ్గాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా భారతదేశంలో కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం రాత్రి నాటికి, యాక్టివ్ కేసుల సంఖ్య వారం క్రితం 47,000 నుండి 25,000 కంటే తక్కువకు పడిపోయింది.
Advertisement
COVID19
india

More Telugu News