వర్షం కారణంగా లక్నో-చెన్నై మ్యాచ్ రద్దు.. ఐపీఎల్‌లో చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!
- లక్నో ఇన్నింగ్స్ 19.2 ఓవర్ల వద్ద ప్రారంభమైన వర్షం
- ఎంతకీ తగ్గకపోవడంతో రద్దు చేస్తున్నట్టు ప్రకటన
- ఇరు జట్లకు చెరో పాయింట్
చెరో 11 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా లక్నో రెండో స్థానంలో, చెన్నై మూడో స్థానంలో నిలిచాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే సమయానికి లక్నో 7 వికెట్ల నస్టానికి 125 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో వాతావరణం సరిగా లేకపోవడం వల్ల మ్యాచ్ ఆగిపోవడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.