మెగా ఫోన్ పట్టిన బాలీవుడ్ బడా స్టార్ కుమారుడు
- డైరెక్టర్ గా వస్తున్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్
- వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభం
- ‘స్టార్‌డమ్’ అనే టైటిల్ ఖరారు
దీన్ని షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు ‘స్టార్‌డమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫీచర్ ఫిల్మ్ కోసం ఆర్యన్ ఖాన్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తన మొదటి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ రచనను పూర్తి చేసినట్లు ఆర్యన్ స్వయంగా ప్రకటించాడు. దీనికి అతనే డైరెక్టర్‌గా, షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ మొదలైన ఈ వెబ్ సిరీస్ లో ఆరు ఎపిసోడ్‌లు ఉంటాయని తెలుస్తోంది.