​​గుజరాత్ తో కోల్ కతా ఢీ... ఈడెన్ గార్డెన్స్ లో డాన్ ఎవరో?​​

Gujarat Titans takes of KKR in Eden Gardens encounter
  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ 
  • తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
  • కోల్ కతాకు మొదట బ్యాటింగ్
  • 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రషీద్ ఖాన్
  • 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆండ్రీ రస్సెల్
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అయ్యే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

కాగా, గుజరాత్ టైటాన్స్ జట్టులోని స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కు ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కాగా... కోల్ కతా నైట్ రైడర్స్ హార్డ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ నేడు 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. వీరిద్దరిలో గెలుపు కానుక అందుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. 

ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ నితీశ్ రాణా వెల్లడించాడు. వీపు నొప్పితో బాధపడుతున్న జాసన్ రాయ్ స్థానంలో రహ్మనుల్లా గుర్బాజ్ జట్టులోకి వచ్చాడని, ఉమేశ్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణాను తీసుకున్నామని వివరించాడు. అటు, గుజరాత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. 

కాగా, కోల్ కతాలో ఆకాశం మేఘావృతమై  ఉండడంతో, ముందు జాగ్రత్తగా మైదానంలో కవర్లు కప్పి ఉంచారు. నగరంలో ఇవాళ వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.
Go Back to Shorts
Gujarat Titans
KKR
Eden Gardens
IPL

More Telugu News