ఆదిపురుష్ కోసం సీతమ్మ ఎదురు చూపులు
- ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం
- సీత పాత్రలో నటించిన కృతీ సనన్
- ఆమె పోస్టర్లను విడుదల చేసిన చిత్ర బృందం
కొత్త పోస్టర్లు, టీజర్లతో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కృతీసనన్ సీత పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ల ను విడుదల చేసింది. ఇందులో లంకలో ఉన్న ఆమె రాముడి రాక కోసం కంటతడితో ఎదురుచూస్తున్నట్లు కనిపించింది. అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం అంటూ ‘జై సియా రామ్’ ఆడియో టీజర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త పోస్టర్‌లో సీతమ్మగా కృతి సనన్ ఆకట్టుకునేలా కనిపించింది. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.