Punjab Kings: ఐపీఎల్ లో నేడు సమవుజ్జీల పోరు... పైచేయి ఎవరిదో!

  • మొహాలీలో పంజాబ్ కింగ్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • టోర్నీలో ఇప్పటి దాకా చెరో 7 మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు
  • నాలుగేసి విజయాలతో కొనసాగుతున్న వైనం
  • రన్ రేట్ లో మెరుగ్గా ఉన్న లక్నో
Punjab Kings won the toss against LSG

ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. మొహాలీలోని పీసీఏ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్న పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

పాయింట్ల పరంగా చూస్తే... లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ సమవుజ్జీలుగా ఉన్నాయి. ఏడేసి మ్యాచ్ లు ఆడిన రెండు జట్లు... చెరో 4 విజయాలు సాధించాయి. రన్ రేట్ లోనే కొద్దిగా అంతరం ఉంది. లక్నో ( 0.547) రన్ రేట్ ప్లస్ లో ఉండగా.... పంజాబ్ (-0.162) మైనస్ లో ఉంది. 

ఈ నెల 15న ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. మరి ఓటమికి లక్నో జట్టు నేడు బదులు తీర్చుకుంటుందో లేదో చూడాలి. ఇరు జట్లలోనూ మార్పులేమీ లేవు.

More Telugu News