ipl: సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ ఆల్​ రౌండర్ దూరం

Washington Sundar has been ruled out of the IPL
షార్ట్స్‌లో చూడండి
గత రెండు సీజన్ల పేలవ ఆటతీరును కొనసాగిస్తూ ఐపీఎల్ 2023లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ నిరాశ పరుస్తోంది. ఆడిన ఏడు మ్యాచ్ ల్లో రెండే గెలిచి ఐదింటిలో పరాజయం పాలైంది. గత మూడు మ్యాచ్ ల్లోనూ సన్ రైజర్స్ కు ఓటమి ఎదురైంది. ఇలా మైదానంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న హైదరాబాద్ కు మరో షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

ఈ విషయాన్ని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ గురువారం ట్వీట్ చేసింది. సుందర్ కాలు కండరాల గాయానికి గురయ్యాడని తెలిపింది. దాంతో, లీగ్ దశలో మిగిలిన ఏడు మ్యాచ్ ల్లో సుందర్ సేవలను హైదరాబాద్ కోల్పోనుంది. నాణ్యమైన స్పిన్నర్ అయిన వాషింగ్టన్ తన బ్యాటింగ్ తోనూ సత్తా చాటుతూ రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అతను లేకపోవడం జట్టుకు తీవ్ర లోటు కానుంది.
Go Back to Shorts
ipl
2023
sunrisers hyderabad
Washington Sundar
injury
out of season

More Telugu News