నన్ను మోసం చేశారు.. లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి మరోలా ఉండేది: భూమిక
Add ap7am to your home Screen

నన్ను మోసం చేశారు.. లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి మరోలా ఉండేది: భూమిక

I was deceived says Bhumika
  • తొలి చిత్రం 'తేరే నామ్' విజయంతో మంచి అవకాశాలు వచ్చాయన్న భూమిక
  • ఆ తర్వాత పెద్ద సినిమా నుంచి తనను, హీరోను తప్పించారని ఆవేదన
  • 'జబ్ వీ మెట్'లో తనను తీసేసి కరీనాను తీసుకున్నారని వెల్లడి
సినీ పరిశ్రమ అంటే కేవలం రంగుల ప్రపంచమే కాదు. మాయా ప్రపంచం కూడా. ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కొందరికి క్యాస్టింగ్ కౌచ్ రూపంలో వేధింపులు ఎదురవుతుంటాయి. మరి కొందరికి అవకాశాల పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రముఖ నటి భూమికా చావ్లా కూడా తాను మోసపోయినట్టు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. 'తేరే నామ్' చిత్రంతో తాను హిందీలో తొలి చిత్రం చేశానని... ఆ సినిమా విజయం సాధించడంతో తనకు మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయని చెప్పింది. 

'తేరే నామ్' తర్వాత తనకు ఒక పెద్ద ఆఫర్ వచ్చిందని... అయితే నిర్మాతలు మారిపోవడంతో హీరోతో పాటు తనను కూడా ఆ సినిమా నుంచి తీసేశారని భూమిక తెలిపింది. ఆ సినిమా టైటిల్ ను కూడా మార్చేశారని చెప్పింది. ఆ సినిమాను చేసి ఉంటే ఇప్పుడు తన పరిస్థితి మరోలా ఉండేదని తెలిపింది. ఆ సినిమా గురించి తాను ఏదేదో ఊహించుకున్నానని... మరో సినిమాను ఒప్పుకోకుండా ఏడాది వేచి చూశానని చెప్పింది. అంతేకాదు 'జబ్ వీ మెట్' సినిమాకు కూడా తొలుత తానే సంతకం చేశానని... తనకు జోడీగా బాబీ డియోల్ ను తీసుకున్నారని... అయితే, బాబీ డియోల్ ను తీసేసి షాహిద్ కపూర్ ను తీసుకున్నారని... ఆ తర్వాత తనను కూడా తీసేశారని... చివరకు ఆ చిత్రంలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ నటించారని ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Bhumika
Tollywood
Bollywood

More Telugu News