Alia Bhatt: రూ. 37 కోట్లతో కొత్త ఇంటిని కొన్న అలియా భట్.. షహీన్ కు రెండు ఫ్లాట్స్ గిఫ్ట్

  • బాంద్రాలో కొత్త ఇంటిని కొన్న అలియా భట్
  • కొత్త ఇంటి విస్తీర్ణం 2,497 చదరపు అడుగులు
  • రూ. 2.26 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించిన అలియా
Alia Bhatta buys new house

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రూ. 37.80 కోట్లు పెట్టి కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. బాంద్రాలోని పాలీ హిల్ ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసింది. దీని విస్తీర్ణం 2,497 చదరపు అడుగులు. ఈ ఇల్లు కపూర్ బంగ్లాకు దగ్గర్లోనే ఉంది. ఈ ఇంటికి సంబంధించి ఈ నెల 10న అగ్రిమెంట్ జరిగింది. కొనుగోలుకు సంబంధించి ఆమె రూ. 2.26 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. మరోవైపు అదే రోజున తనకు చెందిన రెండు ఫ్లాట్లను తన సోదరి షహీన్ కు గిఫ్ట్ గా ఇచ్చింది. వీటి విలువ రూ. 7.68 కోట్లు. వీటిలో ఒక ఫ్లాట్ విస్తీర్ణం 1,197 చదరపు అడుగులు కాగా... మరో ఫ్లాట్ విస్తీర్ణం 889.75 చదరపు అడుగులు. గత ఏడాది ఏప్రిల్ 14న అలియాభట్, రణబీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు జన్మించగా.. రాహా కపూర్ అనే పేరు పెట్టుకున్నారు.

More Telugu News