‘సిక్కో సైకో’ అంటూ సెటైరికల్ పాటతో చంద్రబాబుకు బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చిన ఆర్జీవీ
- ఈ రోజు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు
- ఆయనకు సర్ ప్రైజ్ ఇస్తానని ముందే ప్రకటించిన ఆర్జీవీ
- కృత్రిమ మేధ చేసిందంటూ సెటైరికల్ పాటను విడుదల చేసిన దర్శకుడు
ప్రస్తుత ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌ను సైకో అని చంద్రబాబు తిడుతుంటారని, ఆ సంగతిని పక్కన పెడితే తానే ఓ సైకో సిక్కో అని తెలుసుకోలేకపోతున్నారంటూ ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో ఈ పాట ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగు దేశంలోకి వచ్చిన సీబీఎన్ మామకు వెన్నుపోటు పొడిచారని, ఆ కర్మ కాలి ఇప్పుడు బాధపడుతున్నాడంటూ సెటైరికల్ లిరిక్స్ ఉన్నాయి.