బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వని మహారాష్ట్ర పోలీసులు
- ఈ నెల 24న ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ సభ
- అంఖాస్ మైదానంలో సభకు అనుమతిని ఇవ్వని పోలీసులు
- మిలింద్ కాలేజీ సమీపంలో సభ పెట్టుకోవాలని సూచన
మరోవైపు మిలింద్ కాలేజీ సమీపంలో సభకు కేసీఆర్ సుముఖంగా లేరని సమాచారం. మరో ప్రదేశంలో సభ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ ఇప్పటికే రెండు భారీ సభలను నిర్వహించారు. ఇప్పుడు మూడో సభ ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు.