Vasuki: తమిళ స్టార్ హీరోలు ఎవరూ పట్టించుకోలేదు: హాస్యనటి పాకీజా

  • హాస్యనటిగా పాకీజాకు మంచి పేరు 
  • తమిళంలో 150 వరకూ సినిమాలు చేసిన నటి 
  • కోలీవుడ్ తనని ఆదుకోలేదని వెల్లడి 
  • టాలీవుడ్ చేరదీసిందంటూ కృతజ్ఞతలు
Vasuki Interview

'అసెంబ్లీ రౌడీ' సినిమా చూసినవారెవరూ 'పాకీజా' అనే పాత్ర పేరును మరిచిపోలేరు. ఆ సినిమాలో ఆమె బ్రహ్మానందంతో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ తరువాత తెలుగులో ఆమె 60 సినిమాలకి పైగా చేశారు. ఇక తమిళంలో 150 సినిమాల వరకూ చేశారు. అయినా ఆమె ఆర్ధికపరమైన ఇబ్బందులు పడుతుండటం బాధాకరం. 

పాకీజా అసలు పేరు వాసుకి .. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " నేను తమిళనాడులో పుట్టి పెరిగినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. అక్కడ నేను చాలా సినిమాలు చేశాను. అయితే అక్కడ లభించే గౌరవం .. పారితోషికం చాలా తక్కువ. అక్కడి షూటింగ్స్ లో సరైన ఫుడ్డు కూడా పెట్టరు" అని అన్నారు. 

" తమిళంలో నేను ఎంతోమంది హీరోలతో కలిసి పనిచేశాను. రాజకీయాలలో 22 ఏళ్లపాటు కొనసాగాను. నేను ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్టార్ హీరోలకి .. పార్టీలోని వారికి నా పరిస్థితిని తెలియపరిచాను. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఎలా ఉన్నావని ఏ ఒక్కరూ అడగలేదు. ఈ పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నది కూడా తెలుగు పరిశ్రమనే" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News