ఈ ముద్దుగుమ్మకు ధోనీ అంటే చాలా ఇష్టమట!

I am a big fan of Dhoni says Megha Akash
  • ధోనికి తాను వీరాభిమానినన్న మేఘా ఆకాశ్
  • పాకెట్ మనీ కోసం చదువుకునేటప్పుడే యాడ్స్ లో నటించానని వెల్లడి
  • తనకు చిన్నప్పటి నుంచి చాలా సిగ్గు అని వ్యాఖ్య
అందం, అభినయం ఉన్న యువ నటి మేఘా ఆకాశ్ తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ఆమె నటించిన సినిమాలు ఊహించినంత విజయం సాధించకపోవడమే దీనికి కారణం కావచ్చు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

చిన్నప్పటి నుంచి తనకు సిగ్గు ఎక్కువని చెప్పింది. నలుగురితో ధైర్యంగా కలిసే దాన్ని కాదని చెప్పింది. ఆ తర్వాత తనను తాను మార్చుకోవాలనుకున్నానని తెలిపింది. చదువుకునే రోజుల్లోనే పాకెట్ మనీ కోసం యాడ్స్ లో నటించానని, ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పింది. సినిమా షూటింగులకు తనతో పాటు అమ్మను కూడా తీసుకెళ్తానని తెలిపింది. క్రికెటర్ ధోనీ అంటే తనకు చాలా ఇష్టమని, తాను ధోనీకి వీరాభిమానినని చెప్పింది. సినిమా హీరోయిన్లలో త్రిష అంటే ఇష్టమని తెలిపింది.
Advertisement
Megha Akash
Tollywood
MS Dhoni

More Telugu News