పెరుగుతున్న కొవిడ్ కేసులతో కేరళ అప్రమత్తం.. వారికి మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం
- కేరళ్లలో గత 24 గంటల్లో 1,801 కేసుల నమోదు
- 60 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్న ఆరోగ్య మంత్రి
- గర్భిణులు, వృద్ధులు మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న ప్రభుత్వం
ఆమె ఆధ్వర్యంలో నిన్న కరోనా పరిస్థితిపై సమావేశం జరిగింది. జినోమ్ సీక్వెన్స్ కోసం పంపిన నమూనాల్లో చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలినట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కరోనా మరణాలు ఎక్కువగా మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లకు పైబడిన వారిలోనే నమోదవుతున్నట్టు చెప్పారు.
కరోనా మరణాల్లో దాదాపు 85 శాతం 60 ఏళ్లు పైబడిన వారిలోనే రికార్డవుతున్నట్టు తెలిపారు. మిగతా 15 శాతం మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. అలాగే, ఇంటి నుంచి బయటకు వెళ్లని ఐదుగురు కరోనాతో మరణించినట్టు వివరించారు. లైఫ్ స్టైల్ వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు పెద్దలు, గర్భిణులు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు.