India: కరోనా కేసులు మళ్లీ పెరగుతుండటానికి XBB1.16 కారణం.. ఈ వేరియంట్ లక్షణాలు ఇవే!

XBB1 variant is the reason for increasing of Corona cases in India
షార్ట్స్‌లో చూడండి
మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న కేసుల సంఖ్య 5 వేలను దాటిపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నెల తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం XBB1.16 వేరియంట్ కారణం అని చెపుతున్నారు. ఢిల్లీలో నమోదవుతున్న కేసుల్లో 98 శాతం ఈ వేరియంట్ కేసులే ఉండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వేరియంట్ ను నిశితంగా గమనిస్తోంది. కేంద్రం కూడా దీనిపై అప్రమత్తంగా ఉంది. 

XBB1.16 వేరియంట్ లక్షణాలు: 
తొలుత జ్వరం వస్తుంది. ఒకటి, రెండు రోజులు జ్వరం ఉంటుంది. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటాయి. ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి, పొత్తి కడుపులో అసౌకర్యం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఈ వేరియంట్ తీవ్రమైన సమస్యలను కలిగించదు. కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు, వయసు పైబడిన వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
Go Back to Shorts
India
Corona cases
New Variant
XBB1.16

More Telugu News