నేడు చెన్నైలో సీఎస్కే తొలి పోరు.. స్టోక్స్ గాయంపై జట్టు ఆందోళన!
- తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన ధోనీసేన
- నాలుగేళ్ల తర్వాత చెపాక్ లో ఈ రోజు బరిలోకి
- బలమైన లక్నోతో పోటీ పడనున్న సీఎస్కే
అందుకే మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా తొలి మ్యాచ్ లో అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. ఇకపైనా అతను బ్యాటర్ గానే కొనసాగుతాడని తెలుస్తోంది. ఇది చెన్నైని కలవర పెడుతోంది. ప్రధాన ఆల్ రౌండర్ అయిన స్టోక్స్ బౌలింగ్ చేయకపోవడం తొలి మ్యాచ్ లో చెన్నైని దెబ్బతీసింది. తను బ్యాటింగ్ లోనూ నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో బలమైన లక్నోతో మ్యాచ్ లో స్టోక్స్ ను ఆడించాలా? అతని స్థానంలో డ్వైన్ ప్రిటోరియస్ ను తుది జట్టులో గానీ లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దింపాలని సీఎస్కే భావిస్తున్నట్టు తెలుస్తోంది.