కోహ్లీ కొత్త టాటూ గుట్టు తెలిసింది!
- ఐపీఎల్ తాజా సీజన్ లో కొత్త టాటూతో కోహ్లీ
- చేతిపై పెద్ద టాటూతో దర్శనమిచ్చిన వైనం
- వివరణ ఇచ్చిన ఏలియన్స్ టాటూ స్టూడియో యజమాని
తన ఆధ్యాత్మికతను సంపూర్ణంగా ప్రతిబింబించేలా టాటూ ఉండాలని కోహ్లీ కోరాడని, జీవితచక్రం మొత్తం ఆ టాటూ ప్రతిఫలించాలని సూచించాడని తెలిపారు. కోహ్లీ మాటలను బట్టి, అతడి మనస్తత్వం ఆ టాటూలో ఉండాలని తనకు అర్థమైందని భానుషాలి వివరించారు. అందుకే, ఆ పచ్చబొట్టును అత్యంత కచ్చితత్వంతో వేసేందుకు ఎంతో కష్టపడినట్టు తెలిపారు.
కోహ్లీకీ టాటూ వేసేటప్పుడు ఎవరూ రాకుండా స్టూడియోను మూసివేశామని, స్టూడియో చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కోహ్లీ కొన్నేళ్ల కిందటే తమ కార్యాలయానికి వచ్చాడని, తమ టాటూల ఫొటోలను చూపించి వాటి గురించి ప్రశంసించాడని భానుషాలి వెల్లడించారు.
కాగా, కోహ్లీ ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అని, తన పేరుప్రతిష్ఠలను కూడా పక్కనబెట్టి ఎంతో గౌరవపూర్వకంగా మాట్లాడాడని కొనియాడారు.