Jose Butler: బట్లర్, జైస్వాల్ దెబ్బకు అల్లాడిన సన్ రైజర్స్ బౌలర్లు

  • హైదరాబాదులో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్స్
  • 6 ఓవర్లలోనే 85 పరుగులు చేసిన రాజస్థాన్ జట్టు
  • ఓపెనింగ్ జోడీని విడదీసిన ఫరూఖీ
Butler and Jaiswal smashes Sunrisers bowling

ఐపీఎల్ లో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ తో పోరులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు పవర్ ప్లేలో ఏ మాత్రం కలిసి రాలేదు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ బంతిని ఇష్టం వచ్చినట్టు బాదడంతో పరుగులు వెల్లువెత్తాయి. 6 ఓవర్లలోనే రాజస్థాన్ స్కోరు 85 పరుగులకు చేరిందంటే బట్లర్, జైస్వాల్ దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

బట్లర్ 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేయగా, జైస్వాల్ 13 బంతుల్లోనే 6 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. బంతి ఎలా వేసినా ఈ జోడీ బౌండరీ లైన్ దాటించడమే పనిగా పెట్టుకుంది. 

కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్ కు అనుభవం లేకపోవడం ప్రతికూలంగా మారింది. ఫీల్డింగ్ మోహరింపు అత్యంత పేలవంగా ఉండడంతో, బట్లర్, జైస్వాల్ జోడీ ఈ లోపాన్ని సద్వినియోగం చేసుకుని బౌండరీల వర్షం కురిపించింది. అయితే బట్లర్ ను లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీ బౌల్డ్ చేయడంతో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ స్కోరు 8 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 105 పరుగులు. జైస్వాల్ 39 పరుగులతోనూ, కెప్టెన్ సంజు శాంసన్ 11 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

More Telugu News