236 మీటర్ల ఎత్తు.. 58 అంతస్థులు.. హైదరాబాద్ లో దక్షిణ భారత్లోనే అతి పెద్ద భవనం
- ఐటీ కారిడార్‌లో నిర్మితం అవుతున్న ఆకాశహార్మ్యం
- సాస్ క్రౌన్ పేరిట నిర్మిస్తున్న భవనంలో 24 అంతస్థులు పూర్తి
- వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారీడార్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాలు
హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు పక్కనే కొలువుదీరుతున్నఈ భవనంలో ఇప్పటికే సుమారు 100 మీటర్ల ఎత్తు.. 24 అంతస్థుల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. ఐటీ కారిడార్‌లో ఇప్పటికే పలు భారీ భవనాలు ఏర్పాటయ్యాయి. 57, 56, 52, 50 అంతస్థులతో కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే, 58 అంతస్థులతో సాస్ క్రౌన్ దక్షిణ భారతంలోనే అతి పెద్ద భవనంగా రికార్డు సృష్టించనుంది.